ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదోని జిల్లా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు ఆదోని ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. పెద్దతుంబళం గ్రామాన్ని కూడా మండలకేంద్రంగా ప్రకటించాలన్నారు. జేఏసీ నాయకులు, కో కన్వీనర్లు నూర్‌అహమ్మద్, రఘురామయ్య, దస్తగిరినాయుడు, న్యాయవాది లలిత, కుంకనూరు వీరేష్, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆదోని జిల్లా ఏర్పాటులో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఈనెల 10న ఆదోని పట్టణ బంద్‌ను చేపడుతున్నట్లు చెప్పారు.


