సనాతనం.. సన్మార్గం.. ఉత్తమం
కోడుమూరు రూరల్: ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని, సన్మార్గంలో నడవాలని, ప్రజలందరికీ ఎంతో ఉత్తమమైనదని విజయవాడ అష్టాక్షరీ పీఠం పీఠాధిపతి శ్రీరామానుజ జీయర్ స్వామి అన్నారు. కోడుమూరు శ్రీరాములవారి దేవాలయం నుంచి శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఆదివారం హిందూ జనజాతర ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీరామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ..హరి–హర క్షేత్రంగా కోడుమూరులో పురాతన పద్ధతిలో భారతి సిమెంట్ జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఎద్దుల మహేశ్వరరెడ్డి ఆలయాలు నిర్మిస్తుండడడం గొప్ప విషయమన్నారు. అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతి ఆదిత్యపరాశ్రీ స్వామి మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, జెడ్‌పీటీసీ సభ్యులు రఘునాథ్‌రెడ్డి, విశ్వహిందూ పరిషత్ దక్షిత భారతదేశ అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, విశ్వబ్రాహ్మణ చైర్మన్ పార్వతమ్మ, నాయకులు కేవీ సుబ్బారెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు సురేంద్ర, శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
సనాతనం.. సన్మార్గం.. ఉత్తమం


