విరగ్గాసిన.. చింత
కుంట చుట్టు ఉన్న చింతచెట్లు
చింత కాయలు పేరు వింటే నోరుతుంది కదూ.. సీజన్ వచ్చేసింది. మార్కెట్‌లో వాటి విక్రయాలు కనిపిస్తున్నాయి. ఈ సారి అధిక వర్షాలు కురువడంతో చెట్లనిండా చింతకాయలే కనిపిస్తున్నాయి. ఇలా కాస్తే పంటల దిగుబడులు ఆశించింత వస్తాయని ఆ గ్రామ రైతుల నమ్మకం. చాలా మంది వేసవిలో పెనుగాలులకు చింతకాయలు నేలరాలిన తర్వాత చింతపండుకోసం పరుగులు తీస్తారు. చింత పూతను సీతమ్మ ప్రసాదంగా భావిస్తారు. ఇక చింతకాయలను పచ్చళ్లకు, చింతపండును వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. చెక్కను వడ్రంగి పనుల్లో విత్తనాలను ఔషధాల తయారీకి ఉపయోగాస్తారు. క్రిష్టిపాడు శివారులో ఉన్న రేగుమానుకుంట వద్ద చింతచెట్లు విరగ్గాసి చూపరులందరినీ నోరూరిస్తున్నాయి. – దొర్నిపాడు
కొమ్మకొమ్మకు కాసిన చింతకాయలు..
విరగ్గాసిన.. చింత


