అ‘పూర్వ’ కలయిక
కల్లూరు: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల తర్వాత ఆ మిత్రులందరూ ఒక్కచోటికి చేరారు. కల్లూ రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం డైమండ్ ఫంక్షన్ హాల్‌లో అట్టహాసంగా గెట్ టు గెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట కలవడంతో చిన్ననాటి సంగతులను గర్తు చేసుకున్నారు. ఒకరినొకరు పకలరించుకుని కష్టసుఖాలను పంచుకున్నారు. తమ కు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ పూలమాల లు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి విందు భోజనాలు చేశారు. నాటి సంఘటనలు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, పాములపాడు ఎంఈఓ సుభాషిణి, ధరిత్రి దేవి, రత్నారెడ్డి, సుభాషిని జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు.


