భక్తిశ్రద్ధలతో లక్ష దీపోత్సవం
హాలహర్వి: అశేష భక్తజనం మధ్య జె.హొసళ్లి గ్రామంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీశైలం మఠం జగద్గురువులు డాక్టర్ కె.చన్నసిద్ధరామ హాజరయ్యారు. శ్రీ అఖండ పరశివమూర్తి శివాచార్య మహాస్వామివారి 46వ సంస్మరణోత్సవం, లక్ష దీపోత్సవం చేపట్టారు. స్వామివారికి ఆకుపూజలు, పంచామృతాభిషేకం, గణపతిపూజ తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు భక్తులు పొందారు. కోలాట, నందికోలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జి.హొసళ్లి గ్రామంలో లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భక్తులు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి పట్టదా శంభులింగ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు.
భక్తిశ్రద్ధలతో లక్ష దీపోత్సవం


