విజేతలకు బహుమతుల ప్రదానం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల విజేతలకు గురువారం టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా వృత్తి విద్యాధికారి డాక్టర్ సి.సురేష్‌బాబు, ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప బహుమతులు ప్రదానం చేశారు. వ్యాస రచనలో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ సీఈసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి పి.సురేష్, వక్తృత్వంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ హెచ్‌ఈసీ విద్యార్థి ఎం.హన్సిక ప్రియదర్శిని, క్విజ్‌లో కేవీఆర్ బాలికల జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి టి.వేదావతి విజేతలుగా నిలిచినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ పరమేశ్వరరెడ్డి, టౌన్ మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి, ఏజీఎంఓ నాయకల్లు సుంకన్న పాల్గొన్నారు.


