పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు
కర్నూలు: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి ఎక్కిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేసి గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటోడ్రైవర్లకు సూచించారు. పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో ప్రయాణించడం ప్రమాదకరమని, విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని, విద్యార్థులను తరలించే వాహన డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడపటం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడటం తగదని డ్రైవర్లను హెచ్చరించారు.
నిప్పంటుకుని బాలుడికి తీవ్ర గాయాలు
కృష్ణగిరి: తండ్రి వెంట పొలానికి వెళ్లిన కుమారుడు ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదానికి గురైన సంఘటన గురువారం మండలంలోని తెగదొడ్డి గ్రామ పరిసరాల్లో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు పొలం పనులకు వెళ్తుండగా 11 ఏళ్ల కుమారుడు మహేంద్ర వెళ్లాడు. పొలంలో పత్తి కట్టె కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తూ మహేంద్రకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన మహేంద్రను వెల్దుర్తి సీహెచ్‌సీకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మల్లన్న సేవలో ప్రముఖులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మాజీ మంత్రి ఆర్కే రోజా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సినీ హిరోయిన్ రవళి వేరువేరు సమయాల్లో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం వేకువజామున వీఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, పిన్నెల్లి, రామకృష్ణారెడ్డి, 11.30గంటల వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సినీ నటి రవళి మల్లికార్జున స్వామివారిని స్పర్శ దర్శనం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రోప్‌వే ద్వారా పాతాళగంగకు చేరుకుని పాతాళగంగలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, హారతులు వెలిగించి పూజలు నిర్వహించుకున్నారు.
రవళి
ఆర్కే రోజా
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు


