వంట గ్యాస్ లీకై పేలుడు
వెల్దుర్తి: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో గురువారం వంటగ్యాస్ లీకై ఇంట్లో పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన జి రామాంజనేయులు మామిడి పంట్ల వ్యాపారం నిమిత్తం తెలంగాణకు వెళ్లగా భార్య, తల్లి కూలీ పనులకు వెళ్లారు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వంట గ్యాస్ లీకై భారీ శబ్దంతో పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లోని వస్తువులు, బయలు ఉంచిన బైక్ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్వేశారు. కాగా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు కాలిపోయి ముద్దగా మారాయని, ఫ్రిజ్, టీవీ, వంట సామగ్రి, బీరువాలోని దుస్తులు, విలువైన పత్రాలు, రూ.97వేల నగదు కాలిపోయాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
విద్యుదాఘాతంతో
బాలుడి మృతి
హాలహర్వి: మండలంలోని సిద్ధాపురం గ్రామంలో భీమేష్, శాంతమ్మ దంపతుల కుమారుడు సోమశేఖర్(12) గురువారం విద్యుదాఘాతానికి క్‌కు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. ఇంట్లో బోరు నీటి కోసం మోటార్‌ను స్విచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమేష్, శాంతమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక్క కుమారుడు సంతానం. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
వంట గ్యాస్ లీకై పేలుడు


