వారు పట్టించుకోరు.. వీరు తీరు మార్చుకోరు!
చింతకుంట సచివాలయం–1లో అధికారులు లేక వెలవెలబోతున్న కుర్చీలు
చింతకుంట సచివాలయం–2కు తాళం వేసిన దృశ్యం
పల్లెల్లో సమస్యల పరిష్కారం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన సచివాలయాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సచివాలయాల ఉద్యోగులు సమయానికి విధులకు హాజరుకావడం లేదు. అప్పుడప్పుడూ అధికారులు చుట్టపుచూపుగా వచ్చి సమయపాలన పాటించాలని చెప్పి వెళ్లడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సచివాలయ ఉద్యోగులు తమ తీరు మార్చుకోవడం లేదు. హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలోని సచివాలయం–1, 2 ఉద్యోగులు గురువారం 11:30 గంటలైనా విధులకు హాజరుకాలేదు. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు సచివాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రజలకు సేవాలయాలుగా ఉన్న సచివాలయాలను పట్టించుకుని ఉద్యోగులు సమయపాలన పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. – హాలహర్వి
వారు పట్టించుకోరు.. వీరు తీరు మార్చుకోరు!


