న్యాయశాఖ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న స్టెనో, టైపిస్టు కమ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు, ఇతర వివారలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 15వ తేదీ సాయంత్రంలోపు జిల్లా కోర్టులో నేరుగా, కోరియర్ ద్వారా, రిజిష్టర్ పోస్టు ద్వారా కానీ అందజేయాలని ఆయన పేర్కొన్నారు.
స్నేహితునికి ఆర్థిక సాయం
శిరివెళ్ల: అనారోగ్యంతో బాధ పడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యర్రగుంట్లకు చెందిన ఎద్దుల రాముడికి తోటి స్నేహితులు గురువారం ఆర్థిక సాయం అందజేశారు. యర్రగుంట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1992–93లో రాముడు పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుండటంతో తోటి క్లాస్‌మేట్స్ రూ.20 వేలు సేకరించి పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు బద్రి ఆధ్వర్యంలో రాముడికి అందజేశారు.


