జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్‌’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరాలు చేశాయి. అయితే నిత్యావసర వస్తువుల ధరల్లో ఒక్క రూపాయి కూడా తగ్గుదల లేకుండా పోయింది. తాజాగా కూరగాయల ధరలు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సామాన్యులను ఉక్కిర | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్‌’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరాలు చేశాయి. అయితే నిత్యావసర వస్తువుల ధరల్లో ఒక్క రూపాయి కూడా తగ్గుదల లేకుండా పోయింది. తాజాగా కూరగాయల ధరలు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సామాన్యులను ఉక్కిర

Nov 4 2025 7:38 AM | Updated on Nov 4 2025 7:38 AM

జీఎస్

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు

ప్రస్తుతం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి....

(కిలోకు రూ.లల్లో)

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో అల్లాడిపోతున్నాం. ఇప్పుడు కూరగాయల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు నాలుగు రెట్లు ధరలు పెరిగాయి. రూ.500 తీసుకెళ్లినా చేతి సంచికి తగిన కూరగాయలు రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

– మహబూబ్‌బీ, బృందావన్‌నగర్‌, కర్నూలు

రైతుబజారుతో పోలిస్తే బయట కిలోకు రూ.10–15 వరకు ఎక్కువ ధరలు ఉన్నాయి. చౌళకాయలు కిలో ధర రూ.80 పైగా ఉంటోంది. అన్ని కూరగాయల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. వారానికి రూ.1,000 అదనపు భారం పడుతోంది. కుటుంబానికి ఆదాయం పెరుగకపోగా.. ధరల పెరుగుదల భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

– లక్ష్మీదేవి, చౌరస్తా, కర్నూలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కూరగాయల సాగుకు రాయితీలు ఇచ్చి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. రబీ సీజన్‌ మొదలై 35 రోజులవుతున్నా కూరగాయల సాగు పెరగలేదు. ఖరీఫ్‌లో అంతంతమాత్రం సాగు చేసిన పంటలు వరుసగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్నాయి. దిగుబడులు పడిపోయాయి. డిమాండ్‌ తగ్గట్టు కూరగాయలు ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది. దీంతో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సామాన్య, మద్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

‘సమగ్ర’ నిర్లక్ష్యం

సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయలేదు. గతేడాది వ్యవసాయ సీజన్‌లో (2024–25)లో ఒక్క రైతుకు కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. ఈ ఏడాది( 2025–26) కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌ ముగిసిపోయి రబీ సీజన్‌ మొదలైనా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాగు దయనీయం

జిల్లాలోవివిధ మండలాల మీదుగా హంద్రీ– నీవా కాలువ వెళ్తోంది. కూరగాయల సాగుకు అవకాశం ఉంది. నీటి సదుపాయం ఉన్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో రైతులకు కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోయింది. 2023 ఖరీఫ్‌లో ఈ–క్రాప్‌ ప్రకారం ఉల్లి, టమాటతో సహా కూరగాయల సాగు 60,614 ఎకరాల్లో ఉంది. ఉల్లి, టమాట మినహాయిస్తే కూరగాయల పంటలు 11,868 ఎకరాల్లో సాగైంది. దీంతో ధరలు పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రోత్సాహకాలు అందక గతేడాది కూరగాయల సాగు 58,382 ఎకరాలకు తగ్గిపోయింది. ఉల్లి, టమాట పంటలను మినహాయిస్తే 6,976 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 72,752 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఇందులో ఉల్లి 61,243 ఎకరాలు, టమాట 6,457 ఎకరాల్లో సాగైంది. ఈ పంటలను మినహాయిస్తే కూరగాయల సాగు 5,052 ఎకరాలకే పరిమితం అయ్యింది. అంతంతమాత్రం సాగైన పంటలు కూడా అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు పడిపోవడంతో కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.

దళారుల ఇష్టారాజ్యం

గత ఏడాది నవంబరు నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో టమాట కిలో రూ.10, క్యాలీప్లవర్‌ రూ.30, బెండ రూ.14, చెవుల కాయ రూ.24 ఇలా ఏ కూరగాయ తీసుకున్నా... రూ.30 వరకే ఉన్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు షాక్‌ కొడుతున్నాయి. నేడు టమాటతో సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. రైతుబజారులో ధరలు కాస్త తక్కువగా ఉంటాయని వెళితే బోర్డుపై రాసిన ధరలను పట్టించుకునే వారే కరువయ్యారు. పేరుకే రైతుబజారు అయినప్పటికీ ఇందులో రైతులు వెదికినా కనిపించరు. నేడు దళారీల బజారు అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి పార్టీల నేతలే రైతుబజారును దళారీల బజారుగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబజారులోనే వంకాయ రూ.56/70 వరకు ఉంటోంది. ఏ కూరగాయ కొనాలన్నా రూ.60 పైనే ఉంటోంది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల ధరలు 30 నుంచి 50 శాతం వరకు ధరలు పెరిగాయి.

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..

2019 నుంచి 2024 వరకు కూరగాయల సాగును అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేషంగాా ప్రోత్సహించింది. హైబ్రిడ్‌ కూరగాయల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. కూరగాయల సాగును విస్తరించేందుకు ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. టమాట ధరలు పెరిగినప్పుడు సబ్సిడీపై పంపిణీ చేసింది. ధరలు నిలకడగా ఉండటంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది.

కూరగాయలు ధర

చౌళకాయ 80

వంకాయ 60/74

టమాట 26

బెండ 54

కాకర 44

బీర 50

క్యాలీఫ్లవర్‌ 54

క్యాబేజీ 28

చిక్కడు 64

దొండకాయ 48

క్యారెట్‌ 60

బీట్‌రూట్‌ 54

క్యాప్సికం 84

బీన్స్‌ 84

దిగుమతి.. దుర్గతి

జిల్లాలో చౌళకాయలు, చిక్కుడు, కాకర, క్యాలీఫవర్‌, క్యారెట్‌, క్యాబేజీ, క్యాప్సికం తదితర అన్ని రకాల కూరగాయలు పండుతాయి. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది వరుసగా తుపాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. వేరుకుళ్లు,. కాయకుళ్లు వంటి తెగుళ్లు సోకడం, నేలతో తేమ ఎక్కువై పంటలు కుళ్లిపోయాయి. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

బె‘ధర’ గొడుతున్న కూరగాయలు

కొనలేక.. తినలేకపోతున్న పేదలు

జిల్లాలో దెబ్బతిన్న

కూరగాయల పంటలు

సాగు తగ్గినా స్పందించని

రాష్ట్ర ప్రభుత్వం

సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించని వైనం

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్1
1/3

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్2
2/3

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్3
3/3

జీఎస్టీని కాస్త తగ్గించి ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement