డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13న జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లోని కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులను లోక్ అదాలత్‌లలో ప్రవేశపెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గవర్నమెంట్ జీఓ నంబర్ 417 ప్రకారం కంపౌండ్, ఎకై ్సజ్ కేసులను కచ్చితంగా పరిష్కరించుకోవాలన్నారు. డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.రామకృష్ణారెడ్డి, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు మంజుల, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
7న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 7న జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశంలో వ్యవసాయం–అనుబంధ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవదాయ ధర్మాదాయ శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరు కావాలని కోరారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 97 ఫిర్యాదులు
కర్నూలు (టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 97 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలీ స్ పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.80 లక్షలు తీసుకుని మోసం చేసిన కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ, కర్నూలు ఔట్‌డోర్ స్టేడియం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారని ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దుల వెంకటసాయి కృష్ణ ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తన తల్లి ఆచూకీ తెలియడం లేదని ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాని ఎస్పీ తెలిపారు.
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్


