హెఐవీ పరీక్షలకు ‘మొబైల్’ అంబులెన్స్
కర్నూలు(సెంట్రల్): మొబైల్ ఐసీటీసీ అంబులెన్స్‌తో ఎక్కడైనా హెఐవీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. హెచ్‌ఐవీ వచ్చిన వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే జీవిత కాలం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఆసుపత్రుల సమన్వయాధికారి జఫరుల్లా, మలేరియా అధికారి నూకరాజు పాల్గొన్నారు.


