● కార్తీక రెండవ సోమవారం భక్తులతో
కిటకిటలాడిన శ్రీగిరి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రం కార్తీక శోభితంగా మారింది. కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. వేకువజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించా రు. భక్తుల శివనామస్మరణలతో శ్రీగిరి క్షేత్రం మారుమోగింది. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ శివ మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతిని నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఉత్సవమూర్తులను పుష్కరిణి వద ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను శాస్త్రోక్తంగా ఇచ్చారు.భక్తులు హారతులను కనులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
లక్ష దీపోత్సవం.. కోటి తేజం!
లక్ష దీపోత్సవం.. కోటి తేజం!
లక్ష దీపోత్సవం.. కోటి తేజం!


