చదువు ‘కూలీ’పోయింది! | - | Sakshi
Sakshi News home page

చదువు ‘కూలీ’పోయింది!

Nov 4 2025 7:02 AM | Updated on Nov 4 2025 7:02 AM

చదువు

చదువు ‘కూలీ’పోయింది!

త్తి చేనులో కూలీ పనులకు వెళ్తున్న ఈ బాలిక పేరు నివేదిత. ఎమ్మిగనూరు మండల పరిధిలోని సోగనూరు గ్రామానికి చెందిన రాముడు, జయంతిల పెద్ద కుమార్తె. 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత 6వ తరగతికి ఆదోనిలోని కేజీబీవీలో సీటు రావటంతో అక్కడ చేర్పించారు. అయితే అలర్జీ కారణంగా పలుమార్లు అనారోగ్యం బారిన పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్థానిక కేజీబీవీలో చేర్పించేందుకు ప్రయత్నించగా సీట్లు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. విషయం డీఈఓ దృష్టికి వెళ్లినా సమస్యకు పరిష్కారం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో బాలికను తల్లిదండ్రులు పత్తి పనులకు వెంట తీసుకెళ్తున్నారు. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా అధికారులు తనకు స్థానికంగా చదువుకునేందుకు అవకాశం కల్పించాలని బాలిక వేడుకుంటోంది.

– ఎమ్మిగనూరు రూరల్‌

చదువు ‘కూలీ’పోయింది!1
1/1

చదువు ‘కూలీ’పోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement