చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బేతంచెర్ల: కనుమకింది కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జంగిటి అనిల్ కుమార్(29) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి శనివారం ఉదయం వచ్చాడు. ఎక్కడకు వెళ్లావని భార్య గంగమ్మ నిలదీయడంతో మనస్తాపానికి గురై పొలం దగ్గరకు వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుని భార్య గంగమ్మతోపాటు రెండేళ్ల కుమార్తె హర్షిత ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నబి తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
