ఆదుకోని ‘ఉపాధి’.. ఆగని వలసలు
కోసిగి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆదివారం కోసిగిలోని వివిధ కాలనీల నుంచే కాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూలీలు టెంపో వాహనాల్లో వలస వెళ్లారు. మరికొందరు రైల్వే స్టేషన్‌లో చైన్నె నుంచి ముంబై వెళ్లే మెయిల్ రైలులో మూటముళ్ల కట్టుకుని రైలు ఎక్కి కర్ణాటక ప్రాంతానికి వెళ్లారు. ఈఏడాది అధిక వర్షాలు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతి పోయాయి. పంటలు చేతిక రాకపోవడంతో కూలీలతో పాటు రైతులు కూడా తరలి వెళ్లుతున్నారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వలస వెళ్లారు. వెళ్లిన చోటు పిల్లతో పాటు ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయని చెబుతున్నారు.
							ఆదుకోని ‘ఉపాధి’.. ఆగని వలసలు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
