జీఎస్‌టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దు
చాలా దుకాణాల్లో నూతన జీఎస్‌టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్‌టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్‌టీ తగ్గించాలంటే డిస్కౌంట్ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్‌టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్‌పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్ అయితే ఎంఆర్‌పీపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. మనం జీఎస్‌టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్ కోల్పోతాం. ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్‌పీపై 7 శాతం జీఎస్‌టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్‌తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్‌గేమ్ ఆడుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
