మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి కబర్ధి
కర్నూలు (టౌన్): మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు సర్వనాశనం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. తాగి వాహనం నడపడంతో ప్రమాదాలు జరగడమే కాకుండా జీవితాలు నాశనం అవుతాయన్నారు. ర్యాలీలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, మొదటి, ఏడవ అదనపు జిల్లా జడ్జీలు కమలా దేవి, లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, న్యాయవాదులు, పారా లీగల్ సిబ్బంది పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
