 
															వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మహానంది: సీతారామాపురం గ్రామానికి చెందిన చింతపూత నరసింహుడు(71) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. నరసింహుడు గ్రామ సమీపంలోని చెంచయ్య పొలం వద్ద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొందన్నారు. మృతుడి భార్య వెంకటసుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పాములపాడు: ఉధృతంగా ప్రవహిస్తున్న సుద్దవాగులో నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లి మండలం నాగంపల్లికి చెందిన వెంకటేష్, పరమేశ్వరుడు, నాగేశ్వరయ్యలు పాములపాడు నుంచి బైక్‌పై వెళ్తున్నారు. పరమేశ్వరుడు ముందుగానే బైక్‌నుంచి దిగాడు. మిగతా ఇద్దరూ అలాగే వెళ్లారు. అదపు తప్పి బైక్ కిందదపడటంతో సుద్దవాగు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న చెలిమిల్ల గ్రామస్తులు స్పందించారు. వెంటనే వెంకటేష్‌ను కాపాడారు. అయితే నాగేశ్వరయ్య ఆచూకీ తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు పుట్టీల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల(అర్బన్): పట్టణ శివారు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమ్రాన్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు మందలించడంతో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
							వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
 
							వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
