 
															మార్కెట్‌యార్డ్‌లో అగ్నిప్రమాదం
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని గోదాంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఖాళీ గోనెసంచులు కాలిపోయాయి. రైతులు, సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించి 500 గోనెసంచుల కాలిబూడిదయ్యాయని గోనెసంచుల వ్యాపారి మాబూబాషా ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్‌యార్డ్ కార్యదర్శి చంద్రమౌలితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు.
బనగానపల్లె: భారీ వర్షాలతో నందవరం గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న 60 మేకపిల్లలు మృతి చెందినట్లు గొల్ల బర్రెన్న, హరికృష్ణ, కృష్ణ మద్దిలేటి తెలిపారు. వర్షంతో పాటు ఈదురుగాలులకు మేక పిల్లలు మృతి చెందినట్లు వారు చెప్పారు. తమకు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
 
							మార్కెట్‌యార్డ్‌లో అగ్నిప్రమాదం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
