మాటామాటా పెరిగి ఇరువురి మధ్య వాగ్వాదం
రహదారి బైఠాయించిన డ్రైవరు
నిలిచిపోయిన వాహనాలు
పోలీసులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్‌కు తరలింపు
పత్తికొండ: పాల వ్యాను డ్రైవర్‌పై ఆదోని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చేయి చేసుకోవడంతో పత్తికొండలోని బైపాస్ రహదారిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం నుంచి ఆదోనికి వెళ్తున్న పాలవ్యానును తనిఖీల్లో భాగంగా రికార్డుల పరిశీలన కోసం బైపాస్ రహదారిలో ఆదోని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కేఎండీ అవైస్ వాహనాన్ని ఆపారు. పాలవ్యాను డ్రైవరు చరణ్‌రెడ్డి బండి రికార్డులను చూపడంలో కాస్త ఆలస్యం చేయడంతో ఎంవీఐ డ్రైవరుపై బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. బండి పేపర్లు లేకపోతే జరిమానా వేయాలి కాని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న స్థానికులు ఎంవీఐను నిలదీయడంతో అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో బైపాస్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంవీఐ చేయి చేసుకోవడంతో డ్రైవరు చరణ్‌రెడ్డి రహదారిపై బైఠాయించి నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ శివాజీనాయక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పాలవ్యాను, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాల లారీ కావడంతో సరుకును ఆదోనిలో దింపి రావాలని చెప్పి పంపించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
వివాదాలకు కేరాఫ్ ఆదోని ఎంవీఐ
రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జరిమానాలు విధించకుండా వాహనదారులపై చేయి చేసుకోవడం ఆదోని ఎంవీఐ కెంఎడి అవైస్‌కు పరిపాటిగా మారింది. గతంలో బెంగళూరుకు చెందిన న్యాయవాది తన కుటుంబసభ్యులతో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదోని మండలం బిణిగేరి వద్ద వాహనాల తనిఖీలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో ఎంవీఐ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా న్యాయవాది కారు బ్యానెట్‌పై ఎక్కగా దాదాపు రెండు కిలో మీటర్లు దూరం తీసుకెళ్లారు. అక్కడి స్థానికులు ఎదురు తిరగడంతో వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం మరోసారి పాలవ్యాను డ్రైవర్‌పై దురుసుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎంవీఐ కేఎండీ అవైస్‌ను వివరణ కోరగా రికార్డులను చూపడంలో పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు దురుసుగా మాట్లాడటంతోనే తాను చేయి పైకెత్తానని తెలిపారు.
పాల వ్యాన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్న ఎంవీఐ
పాల వ్యాన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్న ఎంవీఐ


