● ఉల్లి పంట జీవాల పాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దేవనకొండ మండలం కరిడికొండ గ్రా మానికి చెందిన రైతు మహబూబ్‌బాషా తనకున్న ఎకరన్నర పొలంలో రూ.1.80 లక్షల పెట్టుబడి పెట్టి ఉల్లి సాగుచేశాడు.పంట చేతికొచ్చే దశలో ఉంది. కోతకోసి మార్కెట్‌కి తరలించాలంటే మరో రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మార్కెట్‌లో ఉల్లి క్వింటా రూ.600 మించి ధర పలకకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధరతో కొనుగోలు చేసే నాథుడే లేకపోవడంతో జీవాలకు వదిలేశాడు.
– దేవనకొండ


