 
															భూసార పరీక్ష ఫలితాలపై అవగాహన కల్పించండి
కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు అవగాహన కల్పించాలని కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మండలాల వ్యవసాయ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 6,500 భూసార పరీక్ష ఫలితాల కార్డులు వచ్చాయని, వీటిని రైతులకు అందజేసి ఫలితాలను బట్టి వచ్చే రబీలో స్థూల, సూక్ష్మ పోషకాలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షల్లో సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్లు తేలితే 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ పోషకాలను పంపిణీ చేస్తామని రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో సాంంకేతిక ఏఓ శ్రీవర్ధన్‌రెడ్డి, ఏఓలు దస్తగిరిరెడ్డి, రవిప్రకాశ్, విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
కర్నూలు: జిల్లా పోలీసు శాఖకు జూడో, క్లస్టర్ ఆటల పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 10వ జాతీయ పోలీస్ జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుంచి ఆర్‌ఎస్‌ఐ కల్పన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరచి కరాటేలో కాంస్య పతకం, పెన్కాక్ సిలాట్‌లో వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్పీ తన క్యాంప్ కార్యాలయంలో ఆమెను సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జావెద్ పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో మే నెలలో నిర్వహించిన బీఈడీ మూడో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 1098 మంది రీ వాల్యుయేషన్‌కు దర ఖాస్తు చేసుకోగా 955 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు htt pr://rayareemauniverrity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
