 
															అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటు
● బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ దార సుధీర్ 
నందికొట్కూరు: వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్‌చార్జ్ అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దార సుధీర్, యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. బుధవారం అబుబక్కర్ మృతదేహానికి డాక్టర్ దార సుధీర్, సిద్ధార్థరెడ్డి, హఫీజ్‌ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబుబక్కర్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతూ జిల్లా స్థాయికి ఎదిగారన్నారు. ఆయన లేని లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయబ్, సురేష్, రవూఫ్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, చంద్రమౌళి, రమేష్‌నాయుడు, అవాజ్ కమిటీ నాయకులు సుభాన్, అబ్దుల్ జబ్బార్, ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ తదితరులు నివాళులర్పించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
