హరికిషన్‌కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
కర్నూలు కల్చరల్: జిల్లాకు చెందిన బాలల కథా రచయిత డాక్టర్ ఎం.హరికిషన్‌కు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ని తెలుగు కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచా ర్య వెలుదండ నిత్యానందరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయుడు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విభాగాధిపతి ఎస్.రమేష్, రిజిస్ట్రార్ కోట్ల హ నుమంతరావు తదితరులు హరికిషన్‌కు పురస్కారాన్ని అందజేశారు. సంయుక్త అక్షరాలు లేకుండా విద్యార్థుల్లో ఉత్తమ విలువలు పెంపొందించేలా అత్యంత సులభమైన శైలిలో రచించిన చందమామ పుస్తకంలోని 25 కథలు పిల్లల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వాళ్లను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని, నవ సమాజ నిర్మాణంలో భాగమవుతాయని, ఇప్పటి తరానికి ఇటువంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో ఉందని అతిథులు పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
