విద్యుదాఘాతంతో వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
నందికొట్కూరు: విద్యుదాఘాతంతో వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్‌చార్జ్ అబుబక్కర్(షేక్ షాలిమియా)(51) మంగళవారం మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. అబుబక్కర్ స్థానిక మా పల్లె దోశ హోటల్ ఎదుట ఉన్న స్టాండ్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టూ ఉన్న వారందరూ కలిసి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పార్టీ యూత్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దార సుధీర్ సంతాపం ప్రకటించారు. అబుబక్కర్ వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడిగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని, ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
