ఆంధ్రా ఉమెన్స్ టీ–20 కోచ్‌గా శ్రీనివాసులు
కర్నూలు (టౌన్): ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 టీ 20 క్రికెట్ మ్యాచ్‌లకు ఫీల్డింగ్ కోచ్‌గా కర్నూలు నగరానికి చెందిన వాల్మీకి శ్రీనివాసులు నియమితులయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉమెన్స్ అండర్–19 మ్యాచ్ బిహార్, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు ఆయన కోచ్‌గా వ్యవహరించడంపై కర్నూలు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా క్రికెట్ అసొసియేషన్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని వయస్సుల క్యాటగిరీలకు ఫీల్డింగ్ కోచ్‌గా, టీమ్ మేనేజర్ గా వ్యవహరించినట్లు వెల్లడించారు.
స్కేటింగ్ సాధనతోనే పతకాలు సాధ్యం
కర్నూలు (టౌన్): ప్రతి రోజు స్కేటింగ్‌ను సాధన చేయడం ద్వారానే పతకాలు సాధ్యమని మానవత కన్వీనర్ యాని ప్రతాప్ అన్నారు. ఆదివారం స్థానిక బి. క్యాంపు లోని ఈట్ స్ట్రీట్‌లో జిల్లా స్థాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. మంచి ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ.. చిన్నారులు అంతర్జాతీయ క్రీడను ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. స్కేటింగ్ క్రీడల్లో వ్యక్తిగతంగా గుర్తింపు రావాలంటే ప్రతి రోజు సాధన తప్పకుండా చేయాలన్నారు. అప్పుడే స్కేటర్లకు మంచి విజయాలు చేకూరుతాయన్నారు. స్కేటింగ్ అసోసియేషన్ సీఈవో సునీల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్కేటింగ్‌లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే నెల 1 వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలోస్కేటింగ్ కార్యదర్శి అబూబకర్, సంయుక్త కార్యదర్శి పునీతా చౌదరి పాల్గొన్నారు.
యువకుడి మృతి
కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలను మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన దస్తగిరి(30) కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం 11.30 గంటల సమీపంలో కోవెలకుంట్లకు వచ్చి సుష్మిత ఫర్టిలైజర్ షాపు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతి చెందినట్లు గమనించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు. మృతుని తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
డిప్యూటేషన్‌పై
డైట్‌కు అవకాశం
కర్నూలు సిటీ: ప్రభుత్వ, జిల్లా, మున్సిపల్ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై ప్రభుత్వ డైట్ (బి.తాండ్రపాడు)కాలేజీలో డిప్యూటేషన్‌పై పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయూబ్ హూసేన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలో ఫిలాసఫి/సోషియాలజీ లెక్చరర్ ఒకటి, తెలుగు లెక్చరర్ ఒకటి, ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులను డైట్ కళాశాలలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు డైట్ కాలేజీ జూనియర్ అసిస్టెంట్ ఉదయ్ 7661913634ను సంప్రదించాలన్నారు.
							ఆంధ్రా ఉమెన్స్ టీ–20 కోచ్‌గా శ్రీనివాసులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
