చోరీ కేసులో నిందితుల అరెస్ట్
కోసిగి: మండల కేంద్రంలోని ఉరుకుంద క్రాస్ రోడ్డు సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న జొల్లు లీలావతి ఇంట్లో ఈ నెల 6వ తేదీన చోరీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు కోసిగి సీఐ మంజునాథ్, ఎస్‌ఐ హనుమంత రెడ్డి తెలి పారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితులను అరెస్ట్ చూపు తూ వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన అంజినయ్య, పరుశురాం కందుకూరు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 25 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.6,300 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులపై రాయచూరులో మర్డర్ కేసు, పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్‌ఐ హనుమంత రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నజీర్, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.
‘పాప దొరికింది’.. అలరించింది
కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘పాప దొరికింది’ హాస్య నాటిక అలరించింది. ఆదివారం సీక్యాంప్ కళాక్షేత్రంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటిక హాస్య భరితంగా సాగింది. అనంతరం నాటిక కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి రూ. 20 వేల నగదు పారితోషికాన్ని అందించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ.. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న సాంఘిక నాటికల ప్రదర్శనలో భాగంగా ఈ నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటిక ఆహుతులను అలరించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడు, కళాక్షేత్రం మాజీ అధ్యక్షులు దస్తగిరి, కార్యదర్శి యాగంటీశ్వరప్ప, సభ్యులు సీవీ రెడ్డి, సంగా ఆంజనేయులు, రాజారత్నం, మహమ్మద్ మియ్యా, రమణ పాల్గొన్నారు.
							చోరీ కేసులో నిందితుల అరెస్ట్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
