గుంతలు దాటలేక..
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డు వ్యవసాయ మార్కెట్‌యార్డు సమీపంలో పత్తి దిగుబడులతో వస్తున్న వాహనం ఆదివారం వర్షపునీటిలో బోల్తా పడింది. చిన్న వర్షం వచ్చినా చెరువుగా మారే ఈ రహదారిలో రోజూ ఒక వాహనం, వ్యక్తులు పడిలేవడం నిత్యకృత్యంగా మారింది. ఆదివారం రైతు పత్తి దిగుబడులను అమ్మకానికి యార్డుకు తీసుకొస్తుండగా వాహనం బోల్తా పడి పత్తి దిగుబడి వర్షపునీటిలో తడిచి రైతుకు నష్టం వాటిల్లింది. ఆ రహదారిపై చిన్న వర్షానికే వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరా యం కలుగుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కనీస మరమ్మతులైనా చేయాలని రైతులు, వాహనాదారులు, స్థానికులు కోరుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
