ఎన్‌సీసీ ప్రవేశాలకు ఎంపిక
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీసీలో ప్రవేశాలు కల్పించేందుకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరాశాంతి అధ్యక్షతన జరిగిన ఈ ఎంపిక ప్రక్రియకు ఎన్‌సీసీ 28 ఆంధ్రా బెటాలియన్ ఆఫీసర్ లెఫ్లినెంట్ కల్నల్ శశికుమార్ హాజరయ్యారు. విద్యార్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించారు. పారామిలటరీ సైనిక, రక్షణ రంగ, పోలీసు, ఇతర ఉద్యోగాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. కాలేజీ నుంచి 32 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఎన్‌సీసీకి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఆఫీసర్ డా.ఆర్ కామల్లీ నాయక్ పాల్గొన్నారు.


