శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీ ఎన్నిక
కర్నూలు(సెంట్రల్) : జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ శారీరక దివ్యాంగ ఉంద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం కార్మిక, కర్షక భవన్‌లో అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ గ్రేషి స్టేబిస్టిన్, ముఖ్య సలహాదారులుగా వన్నూర్‌బాషా, లక్ష్మన్న, జిల్లా అధ్యక్షుడిగా కె.నాగరాజు, ఉపాధ్యక్షులుగా కె.రాముడు, మహేశ్వరరెడ్డి, రమేష్, ప్రధాన కార్యదర్శిగా పి.బాషా, కోశాధికారిగా జి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులుగా ఎస్.దేవేంద్ర, టి.హరికృష్ణ, చాంద్‌బాష, నీలప్ప, ఎస్‌ఎండీ రఫీక్, జిల్లా కన్వీనర్‌గా పి.కిశోర్‌కుమార్, ఐటీ కార్యదర్శి ఇబ్రహీం, మీడియా కార్యదర్శిగా ఎం.రవీంద్రబాబు, లాజిస్టిక్ కార్యదర్శులుగా టి.శీను, ఎం.రవికుమార్, ఎ.శివారెడ్డి, సాంస్కృతి విభాగం కార్యదర్శులుగా జెట్టివీరేష్, సూర్యప్రకాష్, డి.విశ్వేశ్వరప్పను ఎన్నుకున్నారు. అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎల్.ఎల్లమ్మ, మహిళా కార్యదర్శులు శ్రీదేవి, సరిత ఎన్నికయ్యారు.
కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం
ఆత్మకూరు రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. ఇందిరా నగర్‌లో నివసించే ప్రవీణ్‌కుమార్ (28)కు ఇటీవల భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. ఇరువురు తరచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన ప్రవీణ్‌కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన వెలువడటంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రవీణ్‌కుమార్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు–దూపాడు రైల్వేస్టేషన్ మధ్య గల హ్యాంగౌట్ హోటల్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం ఉదయం రైలు కింద పడి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుంది. క్రీమ్ కలర్ హాఫ్ షర్టు, ముదురు ఎరుపు రంగు షార్టు ధరించాడు. కుడిచేతి మణికట్టుపై సులోచన అనే అక్షరాలు ఉన్నాయి. 5.5 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ వర్ణం ఉంటాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే పీఎస్ హెడ్ కానిస్టేబుల్ నూర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 99088 89696 లేదా 90304 81295 లేదా 99859 37035 నంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీ ఎన్నిక


