
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
అవుకు(కొలిమిగుండ్ల): బనగానపల్లె నుంచి అవుకు మండలం మంగంపేట తండాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం మార్గమధ్యంలో అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. బస్సులో 25 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఏమీ కాక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగ కావడంతో ప్రజలు నిత్యావసర సరుకులు,ఇతర వస్తువులను బనగానపల్లెలో తీసుకొని బస్సులో బయలుదేరారు. బస్సు కృష్ణగిరి మెట్ట మీదుగా మంగంపేటకు ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగింది.