
సారూ కాళ్లు మొక్కుతా .. స్తంభాలు తొలగించండి
● తహసీల్దార్‌ను వేడుకున్న రైతు కుమారుడు
నందికొట్కూరు: సారూ తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించండి అంటూ మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమారుడు స్వామన్న తహసీల్దార్ శ్రీనివాసులు కాళ్లు మొక్కాడు. బుధవారం గ్రామ సభ జరుగుతుండగా స్వాములు తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఉన్నదే ఎకరా పొలమని, అందులో విద్యుత్ స్తంభాలు వేయడంతో సాగుకు కష్టంగా మారిందని, ఇదే విషయమై పదేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా.. స్పందించిన తహసీల్దార్ విద్యుత్ అధికారులతో మాట్లాడి తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు.