హామీలు ఇస్తాం.. అంతే ! | - | Sakshi
Sakshi News home page

హామీలు ఇస్తాం.. అంతే !

Oct 1 2025 10:11 AM | Updated on Oct 1 2025 10:11 AM

హామీల

హామీలు ఇస్తాం.. అంతే !

చంద్రబాబు హామీ ఇప్పటికీ నెరవేరలేదు 16 నెలలవుతున్నా కొత్త పింఛన్ల ఊసెత్తరు

ఉమ్మడి జిల్లాలో 8,911 పింఛన్ల రద్దుకు నోటీసులు

దివ్యాంగుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం

అయినప్పటికీ 1వ తేదీ వస్తుందంటే భయమే..

ఇప్పటికే గుట్టచప్పడు కాకుండా 13,629 పింఛన్ల కోత

అతీగతీ లేని 50 ఏళ్లకే పింఛను హామీ

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామన్నారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రస్తుతం నాకు 53 ఏళ్లు. పింఛనుపై పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోంది.

– ఓబులేసు, రామాపురం, తుగ్గలి మండలం

నారా చంద్రబాబు నాయు డు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ల ఊసెత్తడం లేదు. మాది బీసీ సామాజిక వర్గం. నా వయస్సు 55 ఏళ్లు. కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారే కానీ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తామని చెప్పడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలో.

– గొల్ల వెంకటేష్‌, ముద్దటమాగి, హొళగుంద మండలం

ఏడాదికి రెండు సార్లు

కొత్త పింఛన్‌లు

వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్‌లు ఇవ్వడం విశేషం. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్‌లను అర్హులైన వారందరికీ మంజూరు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు కొత్త పింఛను ఇంటి తలుపు తట్టేది. వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్‌లు 1.20 లక్షలకుపైగా జారీ అయ్యాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్కటీ కొత్త పింఛను ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్ల కోసం ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వేలాది మంది నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్‌లు ఎప్పుడంటూ ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రెండు లక్షల మందికి పైగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏస్థాయిలో మోసగిస్తుందో అర్థమవుతోంది. పైగా అనర్హత పేరిట దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు చర్యలు చేపట్టడం గమనార్హం. పింఛన్ల వల్ల దివ్యాంగులు సమాజంలో గౌరవంగా బతకగులుగుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వేలాది దివ్యాంగుల నోటికాడి ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తోంది. అక్టోబర్‌ నెల పింఛన్లు బుధవారం పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 4,748, నంద్యాల జిల్లాలో 4,163 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 8,911 దివ్యాంగుల పింఛన్లపై అనర్హత వేటు వేసి ఆగస్టులో నోటీసులు కూడా అందించారు. అర్హత ఉన్నప్పటికీ తొలగింపుల నోటీసు ఇవ్వడంపై వేలాది మంది అప్పీల్‌ చేసుకున్నారు. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం సెప్టెంబర్‌ నెలలో దాదాపు అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అప్పీల్‌ చేసుకున్న వారి వికలత్వాన్ని మరోసారి పరిశీలిస్తామని.. అంతవరకు పింఛన్లు కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ 1వ తేదీ వస్తుందంటే దివ్యాంగుల్లో టెన్షన్‌ మొదలవుతోంది. జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోననే ఆందోళన కనిపిస్తోంది.

50 ఏళ్లకే పింఛను ఏమైంది!

సూపర్‌–6 హామీల్లో అత్యంత ప్రధానమైన హామీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించడం. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించని పరిస్థితి. అయినప్పటికీ సూపర్‌–6 సూపర్‌ హిట్‌ అంటూ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుండటం ప్రజల్లో నవ్వులపాలవుతోంది. వంచన చేసిన ముఖ్యమంత్రిపై 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వితంతు మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా

13,629 పింఛన్ల కోత

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతినెలా పింఛన్లలో కోత పడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌ నెల నాటికి 12,736 పింఛన్లు కోత కోశారు. ఈ ఏడాది జూన్‌ నెలలో 4,67,389 పింఛన్లు ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఆ సంఖ్య 4,53,760కి చేరుకుంది. 16 నెలల కాలంలో గుట్టుచప్పుడు కాకుండా 13,629 పింఛన్లు తొలగించడం గమనార్హం.

కర్నూలు జిల్లా

పింఛనుదారుల గుండెల్లో గుబులు

హామీలు ఇస్తాం.. అంతే !1
1/2

హామీలు ఇస్తాం.. అంతే !

హామీలు ఇస్తాం.. అంతే !2
2/2

హామీలు ఇస్తాం.. అంతే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement