
94 శాతం అధిక వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. గత సెప్టెంబర్ నెల రికార్డు స్థాయిలో 94 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు హొళగుంద, చిప్పగిరి మండలాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంత్రాలయంలో అత్యధిక వర్షపాతం, మద్దికెరలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 19.2 మి.మీ వర్షం కురిసింది. వరుసగా రెండు నెలలు అధిక వర్షపాతం నమోదవుతుండటంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా ఉల్లి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆస్పరి మండలం యాటకల్ గ్రామంలో ఎంకప్ప అనే రైతు 400 బస్తాల ఉల్లిని వంకలో పారబోశారు. క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన మూలింటి మనోజ్ ఉల్లిని కొనేవారు లేకపోవడం, అధిక వర్షాలతో కుళ్లిపోతుండటంతో రోడ్డు పక్కన పారబోయడం గమనార్హం.
మండలం వర్షపాతం(మి.మీ)
మంత్రాలయం 53.4
పెద్దకడుబూరు 49.4
గోనెగండ్ల 43.8
ఎమ్మిగనూరు 36.4
కౌతాలం 32.4
కోసిగి 30.6
నందవరం 30.2
ఓర్వకల్ 30.2
కోడుమూరు 27.4
కల్లూరు 25
సీ.బెలగల్ 20.6