
పీహెచ్‌సీల్లో నిలిచిన వైద్య సేవలు
నందవరం: పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో పేదలకు వైద్య సేవలు అందకుండా పోయాయి. నందవరం మండలంలో హాలహార్వి, నందవరంలో పీహెచ్‌సీ సెంటర్లు ఉన్నాయి. నందవరం పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీలతో ఓపీలు, వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులతో వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం పీహెచ్‌సీ డాక్టర్లు విధులకు హాజరై కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించారు.
నందవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం