
ధరలు ఇంకా పెరుగుతాయనే భయం
ధరలు పెరుగుతున్నా అవసరాన్ని బట్టి కొనక తప్పడం లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,500 ఉంది. ఈ ధర రూ.లక్షలోపునకు వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉన్నందున కాస్త ముందుగానే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. – స్వాతి, కర్నూలు
ఏడాదిలో 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.40 వేల పెరుగుదల ఉంది. ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేచి చూడటం వల్ల ధరల భారాన్ని భరించడమే అవుతుంది. డిజైన్‌లు ఆకట్టుకుంటున్నా ధరలు, తరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.– రూప, కర్నూలు
●

ధరలు ఇంకా పెరుగుతాయనే భయం