అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా! | - | Sakshi
Sakshi News home page

అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!

Sep 30 2025 7:59 AM | Updated on Sep 30 2025 7:59 AM

అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!

అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!

విచారణ చేపడతాం

మంత్రాలయం: దుకాణం లేదు.. వ్యాపారం ఊసే లేదు.. అయినా ట్రేడర్స్‌ను సృష్టించి జీఎస్టీ నంబర్‌ పొందాడు. రూ.కోట్లలో వ్యాపారాలు చేసినట్లు దొంగ బిల్లులతో ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశాడు. అకౌంటెంట్‌ ముసుగులో ఒక వ్యక్తి మూడేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా చేసిన మోసం ఇదీ. రాయచూరుకు చెందిన ఓ డీలర్‌కు అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చీటింగ్‌ వెలుగులోకి వచ్చింది.

ఇలా మోసం..

మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య విశాల పేరున ట్రేడర్స్‌ను సృష్టించాడు. పాతూరులోని ఇరుకు సందులో ఇంటి చిరునామాలో దుకాణం ఉందని రికార్డులో చూపాడు. అందులో ఐరన్‌, సిమెంట్‌, పెయింట్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. విశాల ట్రేడర్స్‌ రిజిస్ట్రేషన్‌తో 2002 ఆగస్టు నెల 4వ తేదీన జీఎస్టీ నంబర్‌ పొంది 2–112 నంబరు ఇంటిని దుకాణంగా చూపించాడు. నాన్‌ మూవింగ్‌ ఆఫ్‌ గూడ్స్‌ తరహాలో ప్రభుత్వ ట్యాక్స్‌ మొత్తాన్ని తన సొంత అకౌంట్‌కు మళ్లించుకున్నా డు. కొంత మంది డీలర్లను నమ్మబలికి తానే బిల్స్‌ వేస్తానని తంతు సాగించాడు. నాన్‌ మూవింగ్‌ ఆఫ్‌ గూడ్స్‌ విధానంతో మూడేళ్లలో రూ.4 కోట్ల మేర టర్నోవర్‌ జరిగినట్లు సమాచారం. ఇన్వాస్‌ బిల్లులు పేరుతో జీఎస్టీ ట్యాక్స్‌ను తన సొంత అకౌంట్‌కు మళ్లించుని దాదాపు రూ.70 లక్షల మేర ప్రభుత్వ జీఎస్టీ ఖజానాకు గండికొట్టినట్లు తెలుస్తోంది.

గుట్టు రట్టు ఇలా..

ఈ చీటింగ్‌ వ్యవహారాన్ని రాయచూరులోని ఓ డీలర్‌ తెలుసుకుని జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ట్రేడర్స్‌, జీఎస్టీ నంబర్‌పై విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఆదోని జీఎస్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందజేసి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. నాన్‌ మూవింగ్‌ ఆఫ్‌ గూడ్స్‌పై వే బిల్లు, ఇన్వాస్‌ బిల్లులు, అలాగే దుకాణాన్ని తని ఖీ చేయాలని విన్నవించారు. రాయచూరు మరో దొంగ ఫర్మ్‌ క్రియేట్‌ చేసుకుని తతంగం మొదలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి చీటింగ్‌ చేసిన వ్యక్తి తన గుట్టును కప్పి పుచ్చుకునేందుకు జీఎస్టీ అకౌంట్‌ను క్లోజ్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

ఫిర్యాదు వచ్చిన మాట వాస్తమే. ఫిర్యాదును ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హెడ్‌ ఆఫీసు నుంచి ఆదేశాలు రాగానే పూర్తి విచారణ చేపడతాం.

– కల్లూరు వరలక్ష్మి, సీటీవో, ఆదోని

అకౌంటెంట్‌ ముసుగులో చీటింగ్‌

వ్యాపారం చేయకుండానే

జీఎస్టీ ట్యాక్స్‌ స్వాహా

దొంగ బిల్లులు సమర్పించిన వైనం

విచారణ చేస్తామన్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement