
మహానందిలో మహాగౌరి దుర్గగా
మహానంది: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారిని మహాగౌరిదుర్గగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని విశేష పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా వాహనసేవను రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, ఎం.నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు.
చౌడేశ్వరిదేవి సేవలో..
బనగానపల్లె రూరల్: నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దేవదాయ శాఖ జోన్–2 రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు చంద్రశేఖర్ ఆజాద్‌ను సత్కరించి ప్రసాదం అందజేశారు.

మహానందిలో మహాగౌరి దుర్గగా