
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించి, బేయర్, న్యూజి వీడు, జీల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, రామచంద్రుడు అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన షాపు యజమానుల లైసెన్స్‌లు రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోతలు ప్రారంభమైనందున జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు అమలు చేయాలని కోరారు. శాస్త్రవేత్తల రిపోర్టు అనంతరం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.