
ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అయినా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే క్షేత్ర స్థాయిలో పలు రూపాల్లో మా ఆవేదనను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువస్తున్నాం. జేఏసీతో చర్చలు సఫలం కాకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నాం.
– యం రవికుమార్, రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్
సచివాలయ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సచివాలయ ఉద్యో గులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు సర్వేలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదు. ఇతర డిమాండ్లు అన్ని కూడా పరిష్కరించదగ్గవే. – కే గోవిందరాజులు, జిల్లా జేఏసీ చైర్మన్
న్యాయమైన సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటికే పలు రూపాల్లో కార్యాక్రమాలను చేపట్టాం. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ కావాలని నిర్ణయించాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర జేఏసీ నాయకులు 15 రోజుల ముందుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్‌కు నోటీసులు కూడా ఇచ్చారు.
– బీ భాస్కర్‌రెడ్డి, జిల్లా జేఏసీ సభ్యులు

ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం

ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం