
అరాచకాలకు మూల్యం తప్పదు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
ఆలూరు: అరాచకాలకు పాల్పడే అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఆలూరు మండల అధ్యక్ష్యడు కె.మల్లికార్జున ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందన్నారు. క్యూఆర్ కోడ్ ఐవీఆఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ను అమలు చేస్తూ ఇష్టానుసారం కేసులను పెట్టిన జైళ్లకు పంపుతున్నారన్నారు. ఈ సంస్కృతికి అడ్డుకట్టవేసేందుకే వైఎస్సార్‌షీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంయుక్త కార్యదర్శి మహానంది, జిల్లా పీఆర్ వింగ్ ఉపాధ్యక్షులు ఓబులేసు, బీసీ సెల్ కార్యదర్శులు శ్రీనివాసులు, ఈరన్న, భాస్కర్, శేషప్ప, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, గిరి, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ, మాజీ మార్కెట్‌కమిటీ డైరెక్టర్ వెంకటే ష్, సోమశేఖర్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.