
కేజీ రోడ్డుపై రాకపోకలు బంద్
ఆత్మకూరురూరల్: సిద్ధాపురం చెరువు కుడివైపు అలుగు పొర్లుతూ కర్నూలు –గుంటూరు రోడ్డు (కేజీ రోడ్డు)పైకి వచ్చాయి. ఇది 340సి జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు అక్కడ కాపలాగా ఉండి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. విజయవాడ, శ్రీశైలం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆత్మకూరు బస్టాండ్‌లోనే నిలిపి వేశారు. చెరువు నిండిందన్న సమాచారం రావడంతో మత్స్యకారులు అలుగుకు అడ్డుగా వలలు కట్టి చేపలు దాటి పోకుండా కాపాడుకునే యత్నం చేశారు. ఇదిలా ఉండగా బవనాశి నదిలో నీటి ప్రవాహం పెరిగి ఆత్మకూరు సమీపంలో రోడ్డుపైకెక్కి పారుతుండడంతో కురుకుంద గ్రామానికి రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే వడ్లరామాపురం వెళ్లే దారిలో కూడా భవనాశినది బ్రిడ్జిలపై వరద నీరు పారుతుండడంతో ఆ గ్రామానికి కూడా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.