
అసెంబ్లీలో చిరంజీవిని అవమానిస్తే పవన్ నోరు మెదపరేం?
● మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు (టౌన్): ఏపీ అసెంబ్లీలో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని విమర్శిస్తే సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా ఉందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పక్కన పెట్టడంతో ఆయన ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. నియోజవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుందన్నారు. చిల్లర మాటలు వద్దని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తనతో మర్యాదగా వ్యవహరించారని చిరంజీవి స్వయంగా మీడియాతో చెప్పిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.