
వర్షాకాలంలోనూ దాహం.. దాహం!
హాలహర్వి: వర్షాకాలంలోనూ మల్లికార్జునపల్లె గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత 20 రోజుల నుంచి గ్రామ ప్రజలు తాగేందుకు నీరు లేకపోవడంతో గ్రామ శివారులోని వక్రేణి వంక వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. దసరా పండుగ వచ్చినా కూడా మంచినీరు వదలకపోవడంతో వక్రేణి నీరే శరణ్యమయ్యిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నీటిని తాగి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, అధికారులు స్పందించి గ్రామానికి సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
వక్రేణి నీటిని బిందెలతో తీసుకెళ్తున్న ప్రజలు