
ప్రమాదం పొటుకు పెట్టింది!
పెద్దాసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్య సేవల కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆసుపత్రిలో ఎదురయ్యే కష్టాలతో వణికిపోతున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పెద్దాసుపత్రిలో ప్రమాదం పొటుకు పెట్టింది. భవనాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఫిమేల్ 5, 6 వార్డుల్లో వాన నీరు గోడల వెంబడి కారుతూ ఫ్లోరుపైకి చేరుకోవడంతో బెడ్లపై కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రోగుల సహాయకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోగులకు అవసరమైన మందులు, ఆహారం కోసం బయటకు వెళ్లాంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సిందే. కాలు జారితే వాళ్లు కూడా అదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే భయపెట్టే పైకప్పు పెచ్చులు.. వానకు తడిచిన విద్యుత్ స్విచ్ బోర్డులు.. ఓ వైపు దోమలు.. వార్డు లోపల కుక్కలు.. వామ్మో ఇదేమి ఆసుపత్రి అని రోగులు భయపడుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
ఆసుపత్రిలోనే కుక్క కరిస్తే..