
కూటమికి బిగ్ షాక్
ఎమ్మిగనూరు టౌన్: ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ నేత కె.ఆర్.మురహరిరెడ్డి ఆ పార్టీని వీడి గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి అన్న మహానందిరెడ్డి మనవడైన కె.ఆర్.మురహరిరెడ్డి వ్యాపారవేత్తగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యారు. వైఎస్సార్‌సీపీలో ఈయన చేరికతో నియోజకవర్గంలో కూటమికి బిగ్ షాక్ తగిలినట్లయింది. వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టారేణుక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడి ఆధ్వర్యంలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, చేనేత నాయకుడు మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ మధుబాబులు ఆయా పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బుట్టా శివనీలకంఠ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టాప్రతుల్, నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైస్ చైర్మన్ నజీర్‌అహమ్మద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప పాల్గొన్నారు.
కర్నూలు(టౌన్): కర్నూలు నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడీసీసీ మాజీ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం మాజీ చైర్మన్ రాంపుల్లయ్య యా దవ్, మాజీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు నరసింహులు యాదవ్, బంధువులు, అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వీరందరికీ మాజీ సీఎం పార్టీ కండువాలు కప్పి అభినందించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ నేత
కె.ఆర్.మురహరిరెడ్డి

కూటమికి బిగ్ షాక్