
కేసీ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
నగరంలో ఈత కొట్టడానికి వెళ్లి స్వామిరెడ్డి నగర్ వద్ద (వినాయక ఘాట్ పైన) ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బళ్లారి చౌరస్తా సమీపంలోని వాస వీ నగర్‌లో నివాసముంటున్న రాముడు కుమారుడు వడ్డె అశోక్ (13), సీతారామ నగర్‌కు చెందిన కొమ్ము శివన్న కుమారుడు కొమ్ము ప్రశాంత్ (12) ఏపీఎస్పీ క్యాంప్‌లో ఉన్న పాఠశాలలో ఒకరు 9, మరొకరు 7వ తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇరువురూ ఈత కొట్టేందుకు స్వామిరెడ్డి నగర్ వద్దకు చేరుకుని కేసీ కెనాల్‌లోకి దిగారు. నీటి ఉధృతిలో మునిగి వారు కనిపించకపోవడంతో స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు. 3వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల అడ్రస్సులు సేకరించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అశోక్‌కు సంబంధించిన టీషర్టు, ప్రశాంత్‌కు సంబంధించిన చెప్పుల ను సంఘటనా స్థలంలో తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కేసీ కెనాల్ వెంట జొహరాపురం వరకు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగి వచ్చారు.
కేసీ కాలువలో గల్లంతైన ప్రశాంత్, వడ్డె అశోక్

కేసీ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు