
పెన్షనర్ల సంఘానికి నేడు ఎన్నికలు
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా సంఘానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. రహస్య బ్యాలె ట్ పేపర్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో పుల్లారెడ్డి, రామసుబ్బయ్య ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. పన్నెండు ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగించారు. దాదాపు 3,400 మంది ఓటర్లు ఉన్న సంఘానికి ఎన్నికల అధికారులుగా పెదనగౌడ్, ప్రభాకర్, కిట్టప్పలు వ్యవహరించనున్నా రు. శుక్రవారం ఉదయం 10కి ప్రారంభమయ్యే ఎన్నిక లు సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. గంట వ్యవధిలోనే తుది ఫలితాలు వెలువరించి అధ్యక్ష కార్యదర్శులకు గెలుపు పత్రాలను అందజేయనున్నారు.